ఆర్‌ఎస్‌ఎస్ హిందువుల శత్రువు

 


ఆర్‌ఎస్‌ఎస్ కు హిందువులతో సంబంధం లేదు.

మరాఠాలను (కాపులను)  అడ్డుకునేందుకు ఆర్.ఎస్.ఎస్ సుప్రీమో గోల్వాల్కర్ గురుజీ విశ్వరత్న డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్ గారిని కలిశారు

Prof. Hari Narke (మహారాష్ట్రలో ముదిరాజ్ కులంకు చెందిన వారు)

మరాఠాలను ఆపేందుకు ఆర్.ఎస్.ఎస్ సుప్రీమో గోల్వాల్కర్ గురుజీ బాబాసాహెబ్‌ను కలిశారు. "ఆర్‌ఎస్‌ఎస్ విష వృక్షం" అని చెప్పి బాబాసాహెబ్ సహకరించడానికి నిరాకరించారు.

"మరాఠా సమాజాన్ని ఎదుర్కోవడానికి, వారిని ఆపడానికి బ్రాహ్మణులకు సహాయం చేయండి, లేకపోతే మరాఠాలు మనందరినీ నాశనం చేస్తారు. మరాఠా యేతరులందరు కలిసి మరాఠాలను వ్యతిరేకిదాం" అని ఆర్‌ఎస్‌ఎస్ సుప్రీమో గోల్వాల్కర్ గురుజీ బాబాసాహెబ్‌ను సెప్టెంబర్ 7, 1949న ఢిల్లీలో కల్సి విజ్ఞప్తి చేశారు.

బాబాసాహెబ్ అతనిని కోపంతో కఠినంగా మందలించాడు. "పేష్వా  కాలంలో మీరు మాతో ఎంతో  దారుణం వ్యవహరించారు. అది నేను ఎలా మర్చిపోగలను? మీరు మళ్లీ పేష్వా గురించి కలలు కంటున్నారు. దాని కోసం మీరు ఆర్‌ఎస్‌ఎస్ రూపంలో బ్రాహ్మణ సమాఖ్య (ఫెడరేషన్‌) ను ప్రారంభించారు. బ్రాహ్మణులందరు మీ సంఘంలో ఉన్నారు. మరాఠాలు లేదా మహర్‌లు లేరు. మీ బృందం ఓ విష వృక్షం. దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీరు ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటే, కుల నిర్మూలన కోసం కుల వ్యవస్థను నాశనం చేయడం కోసం దాన్ని ప్రారంభించండి. అప్పుడే మీకు పేష్వా కలంలో మీరు చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారు. పాత తప్పులను సరిదిద్దండి. బ్రాహ్మణ రాజ్య కలలను మర్చిపోండి. నేను నీకు అస్సలు సహాయం (మదతు) చేయలేను." అంటూ బాబాసాహెబ్ గోల్వాల్కర్ గురూజీని పరుష పదజాలంతో మండిపడ్డారు. బాబాసాహెబ్ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. మౌనంగా వెళ్లిపోయారతను.

బాబాసాహెబ్ మరియు గోల్వాల్కర్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన ఈ వివరణాత్మక కథనాన్ని వ్రాసిన సోహన్‌లాల్ శాస్త్రి ఢిల్లీలో గొప్ప పండితుడు. ఈ చర్చా సమయంలో ఆయన భౌతికంగా అక్కడే ఉన్నారు. ఆయన తరచుగా బాబాసాహెబ్ వద్దకు వెళ్లి వస్తుండేవారు.

★ సోహన్‌లాల్ శాస్త్రికి గోల్వాల్కర్ల గురించి తెలియజేస్తూ అంబేడ్కర్ ఇలా అన్నాడు "ఈ బ్రాహ్మణ వ్యక్తులు హిందువుల పోప్‌లు. ఇలాంటి సనాతన మత నాయకులు ఉన్న చోట ప్రజలు ఎప్పటికీ బాగుపడరు!"

ఈ సమావేశంపై ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది అమిటాంటే బాబాసాహెబ్ గారు "సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) పనిని పెంచండి మీ పనితో నేను సంతోషంగా ఉన్నాను" అని చెప్పినట్లు ప్రచారంలో ఉంచారు. వర్ణ వ్యవస్థని పెంచే "సంఘ్" యొక్క పని పట్ల బాబాసాహెబ్ ఎలా సంతోషించగలడు?

వారి భావజాలం, పని విధానం, సిలబస్ అన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ వారిద్దరినీ ఎలా ఎందుకు మెచ్చుకుంటారు?

- - ప్రొ. హరి నర్కే 20 ఏప్రిల్ 2020

(ఆధారం - చూడండి /చదవండి : బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్, సోహన్‌లాల్ శాస్త్రి 25 ఏళ్ల పరిచయం, భారతీయ బౌద్ధ మహాసభ, ఢిల్లీ ప్రదేశ్, న్యూఢిల్లీ, 1975, పేజీలు 54/55లో)

మరాఠీ నుంచి తెలుగులోకి అనువాదం :

  -  బద్ది హేమంత్ కుమార్ తెలంగాణ లింక్ సంపాదకులు, అంబేడ్కరైట్ మేధావి

  -  ఎడిటింగ్ : మూల్ నివాసి మాలజీ  MTBF చైర్మన్ - అంబేడ్కరీస్ట్

మరాఠీ ఒరిజినల్ లేఖ :

मराठ्यांना रोखण्यासाठी आर.एस.एस. सुप्रिमो गोळवलकर गुरूजी बाबासाहेबांना भेटले

प्रा. हरी नरके

मराठ्यांना रोखण्यासाठी आर. एस. एस. सुप्रिमो गोळवलकर गुरूजी बाबासाहेबांना भेटले. आर एस एस हा विषवृक्ष आहे असे सांगत बाबासाहेबांनी सहकार्य नाकारले.

मराठा समाजाचा सामना करण्यासाठी, त्यांना रोखण्यासाठी आम्हा ब्राह्मणांना मदत करा, नाहीतर मराठे आपल्या सर्वांनाच संपवतील, आपण सारे मराठेतर एकत्र येऊन मराठ्यांचा बंदोबस्त करू असा प्रस्ताव घेऊन आर.एस.एस. सुप्रिमो गोळवलकर गुरूजी बाबासाहेबांना ७ सप्टेंबर १९४९ ला दिल्लीत जाऊन भेटले.

बाबासहेबांनी त्यांना कठोरपणे खडे बोल सुनावले. "पेशवाईत तुम्ही लोकांनी आमच्यावर कितीतरी अत्याचार केले, हे मी कसे विसरू? तुम्ही पुन्हा पेशवाईची स्वप्नं बघता आहात. त्यासाठी तुम्ही रा.स्व.संघाच्या रूपात ब्राह्मण महासंघ सुरू केलेला आहे. तुमच्या संघात सारे ब्राह्मणच तर आहेत. तिथे ना मराठे आहेत ना महार. तुमचा संघ हा विषवृक्ष आहे. त्याचे परिणाम फार वाईट होणार आहेत. तुम्हाला संघटनाच बनवायची असेल तर ती जातीनिर्मुलनासाठी आणि चातुर्वण्यव्यवस्थेचा नाश करण्यासाठी सुरू करा. पेशवाईतील पापांपासून तरच तुम्हाला मुक्ती मिळेल. जुन्या चुका सुधारा. ब्राह्मण राज्याची स्वप्नं विसरा. मी तुम्हाला काहीही मदत करू शकत नाही" अशा कठोर शब्दात बाबासाहेबांनी गोळवलकरगुरूजींना फटकारले. बाबासाहेबांच्या एकाही प्रश्नाला ते उत्तर देऊ शकले नाहीत. चडफडत ते तिथून निघून गेले.

बाबासाहेब - गोळवलकर यांच्या भेटीचा हा तपशीलवार वृत्तांत लिहिणारे सोहनलाल शास्त्री हे दिल्लीतले मोठे विद्वान होते. ते या भेटीच्या वेळी तिथे प्रत्यक्ष हजर होते. ते बाबासाहेबांकडे नेहमी जात-येत असत. गोळवलकरांबद्दल सोहनलाल शास्त्रींना माहिती देताना बाबासाहेब म्हणाले, "हे ब्राहमण गृहस्थ आहेत हिंदूंचे पोप. असे सनातनी विचारांचे धर्मगुरू जिथे आहेत तिथल्या लोकांचे कधीही भले होणार नाही!"

आणि संघवाले या भेटीबद्दल धादांत खोट्या अफवा पसरवतात. बाबासाहेब म्हणाले म्हणे, "संघाचे काम वाढवा, मी तुमच्या कामावर खूश आहे." चातुर्वर्ण्याची प्रस्थापना करणार्या  संघटनेच्या कामावर बाबासाहेब कसे खूश होऊ शकतील?

दोघांची विचारधारा, कार्यप्रणाली, विषयपत्रिका सगळेच विरोधी असताना बाबासाहेब त्यांचे कौतुक कसे आणि का करतील?

- प्रा. हरी नरके, २० एप्रिल २०२०

(पाहा : बाबासाहेब डॉ. अम्बेडकर के सम्पर्क में २५ वर्ष, सोहनलाल शास्त्री, भारतीय बौद्ध महासभा, दिल्ली प्रदेश, नई दिल्ली, १९७५, पृ. ५४/५५)

"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """

ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.

గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl 

Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl

Regards

Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘