సంభాజీనాగర్ 24.10.2025 : భారత దేశ చరిత్రలో ఓ చారిత్రాత్మక సంఘటన జరిగింది. ఇటీవల వంచిత్ బహుజన్ అఘాడి (విబిఏ) ఆధ్వర్యంలో మహారాష్ట్ర సంభాజీనాగర్ (ఔరంగాబాద్) సిటీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ నిరసనకు యావత్ బహుజన ప్రజల స్పందన ఘనంగా లభించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ పై నిరసన తెలిపి, వారిపై సవాలు విసరడం గొప్ప పరిణామం. ఇది మహారాష్ట్ర చరిత్రలో 2వ సారి విజరుంభణ. ఈ సందర్భంగా విబిఏ యువ నాయకుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మునిమనవడైన సుజాత్ అంబేడ్కర్ మాట్లాడుతూ తాము ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంకు శాంతియుతంగా వెళ్లి వారికి మూడు బహుమతులు అందజేయాలని అనుకున్నాం. ముఖ్యంగా భారత రాజ్యాంగం గ్రంథం. దీని ద్వారా రాజ్యాంగ మార్గదర్శకాల ప్రకారం వారి కార్యకలాపాలను అనుసరించాలి, గౌరవించాలని. రెండవది మన జాతీయ త్రివరణ జెండా. వారి అన్ని ఆఫీస్ లల్లో జాతీయ జెండాను ఎగురవేయడం ప్రారంభించమని, ఆగస్టు 15న బ్లాక్ డేగా పాటించకుండా ఉండాలని కోరాం. చివరగా మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్ చట్టం బుక్. ఐతే ఆ చట్టం ప్రకారం వారి సంస్థను నమోదు చేసుకోవడానికి సహాయ పడుతుందని అనుకున్నాం. అయితే తాము చేరుకునేలోపు వారి కార్యాలయాన్ని మూసేసి, ఆర్ఎస్ఎస్ సభ్యులు పారిపోయారని పేర్కొన్నారు. చివరికి ఔరంగాబాద్ కు చెందిన పోలీస్ డీసీపీ కి తమ తరపున ఇట్టి 3బహుమతులను అందజేశామని అన్నారు.
సుజాత్ అంబేడ్కర్ ఇక ముందు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పటికీ భారత రాజ్యాంగం, జాతీయ జెండా పట్ల ద్వేషాన్ని కల్గి ఉందని మరోసారి రుజువు అయిందన్నారు. ఐతే భీమ్ సైనికులకు (అంబేడ్కర్‌వాదులకు) మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించే శక్తి 'రాజకీయ సంకల్పం' గట్టిగా ఉందని, తాము ఎంతటికైనా తెగించి తిరుతామని సుజాత్ ఈ సందర్బంగా ప్రకటించారు.
ఇది 2వ సారి దండయాత్ర. మొదటిసారి 6అక్టోబర్ 2022లో బాంసెఫ్ "భారత్ ముక్తి మోర్చా" ల ఆధ్వర్యంలో నాగ్ పూర్ లోని ఆర్.ఎస్.ఎస్ హెడ్ క్వార్టర్ ను ముట్టడించడం జరిగింది.
అయితే రాబోయే రోజుల్లో సమస్త బహుజన లోకం యువనేత సుజాత్ అంబేడ్కర్ కు తోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల్లో చర్చ సాగుతుంది.
--- మూలనివాసి మాల జీ
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
మందు విందు వద్దురా !
మన బిసి/ఎస్సి/ఎస్టీ రాజ్యాంగం హక్కులు ముద్దురా !!
- బద్దీ హేమంత్ కుమార్ - తెలంగాణ లింక్ సంపాదకులు
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment
Regards
Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘.png)
.png)