కోరుట్ల, నవంబర్ 10 2025 : జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని రామారావుపల్లె గ్రామానికి చెందిన దళిత రైతు, శారీరకంగా వికలాంగుడైన బద్ది హేమంత్ కుమార్ భూమిని గ్రామంలోని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్న ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే — బద్ది హేమంత్ కుమార్ పేరు మీద సర్వే నంబర్ 460లో, అతని తమ్ముడు గోపాల్ పేరుతో సర్వే నంబర్ 460లో, చెల్లెలు గంగజమ్న పేరుతో సర్వే నంబర్ 413/Aలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ ముగ్గురు సంవత్సరాలుగా ముంబైలో జీవనం సాగిస్తుండగా, వారి గైర్హాజరీని ఉపయోగించుకుని చిలివేరి మహేష్, మొండి మాలయ్య, నర్మదా అలియాస్ లహరిక, రవిబాబు అనే నలుగురు కలిసి భూమిని అక్రమంగా ఆక్రమించి సాగుచేసుకుంటూ లాభం పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
విషయం తెలుసుకున్న బాధితుడు భూమిని తిరిగి ఇవ్వాలని అడగగా, నిందితులు మొదట అంగీకరించి, తర్వాత నిరాకరించారు. గ్రామ పెద్దల పంచాయతీకి కూడా హాజరుకాలేదు. స్థానిక పోలీసులు “ఇది సివిల్ వివాదం” అంటూ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు.
తరువాత బాధితుడు కోరుట్లకు చెందిన న్యాయవాది బద్ది నర్సయ్యను సంప్రదించగా, ఆయన కోర్టులో వాదిస్తూ – “భూమి ఆక్రమణలో మోసం, బెదిరింపు, కుట్ర వంటి క్రిమినల్ అంశాలు కూడా ఉన్నందున ఇది కేవలం సివిల్ కేసు కాదని” తెలిపారు. ఈ సందర్భంగా 2009 సుప్రీంకోర్టు తీర్పు (Criminal Appeal No. 416/2009)ను ఉదాహరణగా చూపించారు, ఇందులో “సివిల్ మరియు క్రిమినల్ అంశాలు కలిగిన వ్యవహారంలో క్రిమినల్ అంశాలను కూడా విచారించాలి” అని పేర్కొంది.
ఈ వాదనలపై కోర్టు అంగీకరించి, పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 419/2025గా, ఐపీసీ మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయింది.
తర్వాత డీఎస్పీ అడ్డూరి రాములు స్వయంగా రామారావుపల్లె గ్రామానికి వెళ్లి భూమి స్థితిని పరిశీలించారు. కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు, ఎస్‌ఐ ఎమ్. చిరంజీవి, రైటర్ వేణుగోపాల్, పంచాయతీ సెక్రటరీ సౌజన్య, రెవెన్యూ సిబ్బంది, డీఎస్పీ కార్యాలయ అధికారి మహేష్ తదితరులతో కలిసి బాధితుడి వాంగ్మూలాన్ని వీడియో రూపంలో రికార్డు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ పరిణామాలతో, సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న వికలాంగుడైన దళిత రైతు బద్ది హేమంత్ కుమార్‌కు తన భూమి తిరిగి దక్కుతుందనే న్యాయ ఆశలు మళ్లీ చిగురించాయి.
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment
Regards
.png)
.png)