క్రిమినల్ చట్టాన్ని విస్మరించకూడదు; కోర్టు ఆదేశాల తో SC/ST అట్రాసిటీ FIR నమోదు

 

కోరుట్ల, అక్టోబర్ 19: జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం, పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల రామారావు పల్లె గ్రామంలో అక్రమంగా ఆక్రమించబడిన దళిత రైతు వ్యవసాయ భూమినీ అక్టోబర్ 19 ఆదివారం రోజున డీఎస్పీ అడ్డూరి రాములు పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. 

వివరాలకు వెళ్లగా – గత కొన్ని సంవత్సరాలుగా ముంబై ప్రాంతంలో జీవనం సాగిస్తున్న రామారావుపల్లె గ్రామానికి చెందిన బద్ది హేమంత్ కుమార్ కులం ఎస్సీ మాల అనే శరీకంగా వికలాంగుగైన రైతు పేరు మీద సర్వే నంబర్ 478/అ/2లో భూమి ఉంది. కానీ ఆయన గ్రామంలో లేని అవకాశాన్ని అడ్డుపెట్టుకుని లతీఫా, షేక్ జాని, నర్మద, రవిబాబు అనే నలుగురు కలిసి ఆ భూమిని అక్రమంగా ఆక్రమించారు. పక్కా పత్రాలు లేకుండా "లతీఫా కూల్‌డ్రింక్స్" హోటల్ పేరు చెప్పి అక్కడ నిర్మాణాలు చేశారు.

 ఎలాంటి పత్రాలు, పర్మిషన్ లేకుండానే పలుకుబడి ఉన్న స్థానిక రాజకీయ నాయకులా అండతో విద్యుత్‌ అధికారుల సహాయం తో విద్యుత్‌ కనెక్షన్ కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితుడు బద్ది హేమంత్ కుమార్ కబ్జాదారులతో ఈ భూమి నాది అని, నా భూమిలో మీరు హోటల్ నడిపించుకుంటున్నారు, నాకు అద్దె ఇవ్వండి లేదా ఖాళీ చేయండి అని చెప్పగా, తొలుత ఇస్తామని అంగీకరించిన వారు చివరకు మొహం చాటేసి “అద్దె ఇవ్వం” అని, "భూమిని ఖాళీ కూడా చేయమని" తేల్చేశారు. చివరికి రైతు చేసిన ఫిర్యాదును పోలీసులు “ఇది సివిల్ విషయంలో పడుతుంది” అంటూ తిరస్కరించారు.

వేరే మార్గం లేక కోరుట్ల పట్టనానికి చెందిన అడ్వకేట్ (న్యాయవాది) అయినా బద్ది నర్సయ్య ను ఆశ్రయించగా, అతను కోర్టులో బలంగా వాదించారు. ఈ కేసులో భూమి విషయంలో తగాదా ఉంది కాబట్టి ఇది కేవలం సివిల్ వివాదం మాత్రమే అనడం సరైంది కాదు. భూమిని కబ్జా చేయడంలో మోసం, బెదిరింపులు, కుట్ర వంటి నేరాలకు సంబంధించిన అంశాలూ ఉన్నాయి. అందుకే క్రిమినల్ చట్టం ప్రకారం కేసు నమోదు కావాలి" అని ఆయన కోర్టుకు వివరించారు.

ఈ వాదనకు ఆధారంగా, 2009లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు (Criminal Appeal No. 416/2009) ను కూడా ఉదాహరణకు వివరించారు.

ఆ తీర్పులో, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది – "ఒకే విషయంలో సివిల్ మరియు క్రిమినల్ అంశాలు ఉంటే, క్రిమినల్ అంశాలను కూడా తప్పనిసరిగా విచారించాలి" అని తీర్పు ఇచ్చింది. ఈ వాదనలు కోర్టును ఆకట్టుకోవడంతో, చివరికి కోర్టు పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనితో ఎట్టకేలకు కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 

ఈ కేసు లో ఐపీసీ, ఎస్సీ/ఏస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నెం. 377/2025గా నమోదు చేశారు. కోరుట్ల CI బి. సురేష్ బాబు, SI పి. రామచంద్రం, రైటర్ వేణుగోపాల్, DSP కార్యాలయం అధికారి మహేష్, రాంరావుపల్లె పంచాయత్ సెక్రెటరీ సౌజన్య ఇతర పోలీసు రెవెన్యూ సిబ్బంది/అధికారుల సహయం తో డీఎస్పీ రాములు స్వయంగా స్థానిక స్థలాన్ని పరిశీలించి, బాధితుడి వాంగ్మూలాన్ని వీడియో ద్వారా రికార్డు చేషి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదంతా చూస్తుంటే... న్యాయం కోసం పడరాని పాట్లు పడిన దళిత రైతుకు చివరకు ఆక్రమణకు గురైన తన భూమి తనకు దక్కుతుందన్న ఆశలు చిగురించాయి.

 - బాలె అజయ్ 

తెలంగాణ లింక్ సబ్ ఎడిటర్

 """" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """

ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.

Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment 



Regards

Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘