బీసీ రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు, రాజకీయ వరం కాదు !
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి వర్గానికి సమాన హక్కులు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది.
బీసీ వర్గాలు కూడా ఈ దేశ నిర్మాణంలో అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాయి.
అయితే రాజకీయంగా ఆర్థికంగా విద్యలో వెనుకబడిన బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజకీయ ఉపకారం కాదు రాజ్యాంగబద్ధమైన హక్కు.
డాక్టర్ అంబేద్కర్ గారి దృష్టిలో “సమాజంలో వెనుకబడిన వర్గాలకు (బిసిలకు) ప్రత్యేక రక్షణ” అవసరం అని Article 15(4), 16(4), 340 వంటి రాజ్యాంగ ఆర్టికల్స్ ద్వారా స్పష్టంగా చెప్పారు.
👉 Article 15(4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రణాళికలు.
👉 Article 16(4) ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ హక్కు
👉 Article 340 వెనుకబడిన వర్గాల (బీసీ) కమిషన్ ఏర్పాటు.
ఇది బాబాసాహెబ్ చూపిన సమానత్వం మార్గం.
ఇప్పుడు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన సంకేతం.
కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలపై న్యాయం చేయాలి. ఇది రాజకీయ నిర్ణయం కాదు, రాజ్యాంగ కర్తవ్యయం. బీసీ వర్గాల హక్కులు, సమానత్వం కోసం మన పోరాటం కొనసాగుతుంది. అంబేద్కర్ చూపిన దారిలో "సమానత్వమే మన మతం, న్యాయమే మన దేవుడు".
- ములనివాసి మాల జీ
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Regards
Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘
.png)